హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం
మీ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన లెర్నింగ్ పాత్
Google నుండి చిన్న, స్వంతంగా చదువుకునే సెషన్లతో ప్రాక్టికల్ AI స్కిల్స్‌ను బిల్డ్ చేయండి – ఎటువంటి ఛార్జీ లేకుండా అందుబాటులో ఉంది. ఏ క్రమంలోనైనా 30–45 నిమిషాల మాడ్యూల్స్‌ను పూర్తి చేసి, మీ రోల్లో 8 బ్యాడ్జ్‌ల వరకు కలెక్ట్ చేయండి.
AIకి ప్రాధాన్యతనిచ్చే ప్రపంచాన్ని హ్యాండిల్ చేయడానికి హయ్యర్ ఎడ్యుకేషన్‌ను సిద్ధం చేయడం
AI ఇంపాక్ట్ సరిగ్గా ఉండాలంటే, టీచర్లే ముందుండి ఈ టూల్ ఎకో-సిస్టమ్‌ను నడిపించాలి. ఈ షార్ట్, సెల్ఫ్-పేస్డ్ AI మాడ్యూల్స్ ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు సాయం చేస్తాయి. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో టీచింగ్ స్టయిల్‌ను మార్చడానికి, స్టూడెంట్స్ రిజల్ట్స్‌ను మెరుగుపరచడానికి Geminiని ఎలా ఉపయోగించేందుకు ఉన్న బెస్ట్ ప్రాక్టీసులను తెలుసుకోండి.
మీ షెడ్యూల్‌కు తగ్గట్టుగా దీన్ని రూపొందించాము
కేవలం 30-45 నిమిషాల్లో, ఫ్యాకల్టీ-కేంద్రీకృత Gemini యూజ్ కేస్‌ను నేర్చుకోండి. మీ కొత్త AI లిటరసీని, స్కిల్స్‌ను ప్రూవ్ చేయడానికి బ్యాడ్జ్‌ను సంపాదించండి.
మీ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశాము.
ఇండియన్ టీచర్ల (ఎడ్యుకేటర్ల) అవసరాలకు తగ్గట్టుగా ఉండే సెషన్స్‌తో ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోండి.
ఆన్-గోయింగ్ కంటెంట్ అప్డేట్లు
2027 ప్రారంభంలో కొత్త కంటెంట్ రిలీజ్ అవుతుంది.
ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్లను మెరుగుపరిచే స్కిల్స్
హయ్యర్ ఎడ్యుకేషన్‌లో స్టూడెంట్స్‌కు మెరుగైన లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి, అలాగే రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోవడానికి AIని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ఇందులో ప్రధానంగా కాగ్నిటివ్ ఎంగేజ్మెంట్ (స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్), ఇన్‌క్లూజివ్ డిజైన్, విద్యార్థి సపోర్ట్, ఏజెంటిక్ వర్క్‌ఫ్లోలు (AI సెల్ఫ్-వర్కింగ్ ప్రాసెస్), ఇన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్ వంటి అంశాలపై ఫోకస్ ఉంటుంది.
Gemini హెల్ప్‌తో మీ ఇంపాక్ట్ చూపించడానికి రెడీగా ఉన్నారా?
మిస్ కాకండి — ఎలాంటి ఖర్చు లేకుండా అందుబాటులో ఉన్న AI ట్రెయినింగ్‌ల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే సైన్-అప్ చేయండి.
ప్రైమరీ & సెకండరీ కోసం
మీరు AIపై పట్టు సాధించే మార్గం
Google నుండి చిన్న, స్వంతంగా చదువుకునే సెషన్లతో ప్రాక్టికల్ AI స్కిల్స్‌ను బిల్డ్ చేయండి – ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఏ క్రమంలోనైనా 30 నిమిషాల మాడ్యూల్స్‌ను పూర్తి చేసి, మీ రోల్లో 8 బ్యాడ్జ్‌ల వరకు సేకరించండి.
ప్రతి ప్రైమరీ & సెకండరీ టీచర్ (ఎడ్యుకేటర్) కోసం AI లిటరసీ
ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌లో AI ఇంపాక్ట్ సరిగ్గా ఉండేలా ముందుండి నడిపించండి. ఈ సెల్ఫ్-పేస్డ్, టీచర్ల అవసరాలకు తగ్గట్టుగా ఉండే AI లిటరసీ ట్రెయినింగ్, టీచింగ్‌లో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను తగ్గించుకుని టీచింగ్ కోసం ఎక్కువ టైమ్ కేటాయించడానికి AIని ఎలా ఉపయోగించాలో మీకు నేర్పుతుంది.
మీ షెడ్యూల్‌కు తగ్గట్టుగా దీన్ని రూపొందించాము
కేవలం 30 నిమిషాల్లో, క్లాస్‌రూమ్‌లో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న Gemini యూజ్ కేస్‌ను నేర్చుకోండి. మీ కొత్త స్కిల్‌ను ప్రూవ్ చేయడానికి బ్యాడ్జ్‌ను సంపాదించండి.
మీ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశాము.
ఇండియన్ టీచర్ల (ఎడ్యుకేటర్ల) అవసరాలకు తగ్గట్టుగా ఉండే సెషన్స్‌తో ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోండి.
ఆన్-గోయింగ్ కంటెంట్ అప్డేట్లు
2027 ప్రారంభంలో కొత్త కంటెంట్ రిలీజ్ అవుతుంది.
AIతో విద్యార్థుల లెర్నింగ్ తీరును, వారిపై మీ ఇంపాక్ట్‌ను మరింతగా మెరుగుపరచండి
విద్యార్థి లెర్నింగ్‌ను వేగవంతం చేయడానికి, టీచర్లు AIని ఒక టీచింగ్ టూల్ లాగా ఎలా ఉపయోగించవచ్చు అన్నది తెలుసుకోండి. Geminiని ఉపయోగించడానికి సంబంధించి బెస్ట్ ప్రాక్టీసుల గురించి తెలుసుకోండి.
Geminiతో లీడ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా?
ప్రైమరీ & సెకండరీ ప్రొఫెషనల్ లెర్నింగ్‌లో ఈ కార్యక్రమం ఒక మైలురాయి వంటిది. ఎలాంటి ఖర్చు లేకుండా అందుబాటులో ఉన్న తాజా AI ట్రెయినింగ్‌ల గురించి తెలుసుకోవడానికి సైన్-అప్ చేయండి.
నేర్చుకోవడానికి, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మరిన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయండి (అన్వేషించండి)
సాధారణంగా వచ్చే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనండి
Google AI ట్రెయినింగ్ ఇనిషియేటివ్‌ను డిజిటల్ అక్షరాస్యతలో బలమైన పునాదిని ఏర్పరచడానికి రూపొందించాము, ఇది Google సురక్షితమైన, డేటా-రక్షిత AI టూల్స్‌ను ఉపయోగించుకోవడానికి టీచర్లకు వీలు కల్పిస్తుంది, తద్వారా వారి ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది, వారి బోధన, పరిశోధన పద్ధతులను మెరుగుపరుస్తుంది. ఈ ప్రోగ్రామ్ లక్ష్యం టీచర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, అడ్మినిస్ట్రేటివ్ పనుల భారాన్ని తగ్గించడం, టీచర్లు & ఫ్యాకల్టీ ద్వారా విద్యార్థులను బాధ్యతాయుతమైన AI-ఇంటిగ్రేటెడ్ భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం.
ఈ సిరీస్‌లో Google ఒక టెక్నాలజీ పార్ట్నర్గా ఉంది. Gemini for Education, Gemini Notebook వంటి Google టూల్స్‌ను వాడుతూ, AI మెయిన్ కాన్సెప్ట్‌లను, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్‌ను టీచ్ చేయడం గురించి, అలాగే AIని బాధ్యతాయుతంగా వాడటం గురించి చెప్పేందుకు ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశాము. NEP 2020కు అనుగుణంగా, ఈ ప్రోగ్రామ్‌ను మా ఇండియన్ పార్ట్నర్లతో కలిసి డెవలప్ చేశాము. దీని ఉద్దేశం, టీచర్లకు AI గురించి విస్తృత అవగాహన కల్పించడం, అలాగే వారి విద్యార్థులు, AIని భద్రంగా, ఎఫెక్టివ్‌గా వాడేలా గైడ్ చేయడం. ఇండియాలోని ప్రతి టీచర్‌కు బెస్ట్-ఇన్-క్లాస్ AI లిటరసీ ట్రెయినింగ్‌ను అందించడానికి, అలాగే క్లాస్‌రూమ్‌లలో, వారి అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌ఫ్లోలలో బోధనా పద్ధతిలో AIని ఉపయోగించడానికి అవసరమైన స్కిల్స్‌ను నేర్పడానికి మేము చేస్తున్న విస్తృతమైన ప్రయత్నాల్లో ఈ ప్రోగ్రామ్ ఒక భాగం.
Google AI ఎడ్యుకేటర్ సిరీస్ (GES)ను చిన్న చిన్న మాడ్యూల్స్‌గా విభజించారు, వీటిని మీ బిజీ అకడమిక్ షెడ్యూల్‌కు అనుగుణంగా మీ సొంత వేగంతో పూర్తి చేయవచ్చు. దీన్ని మూడు ప్రధాన కేటగిరీలుగా విభజించాము: ఫౌండేషనల్ అండర్స్టాండింగ్, పెడగాజికల్ అప్లికేషన్స్ (ప్రైమరీ & సెకండరీకి సంబంధించి గ్రేడ్-స్థాయి నిర్దిష్టమైనవి), అడ్మినిస్ట్రేటివ్ అప్లికేషన్స్.
ప్రైమరీ & సెకండరీ టీచర్ల కోసం: ప్రతి మాడ్యూల్ 30 నిమిషాల వరకు ఉంటుంది.
హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ కోసం: ప్రతి మాడ్యూల్ 30–45 నిమిషాల వరకు ఉంటుంది.
Google AI ఎడ్యుకేటర్ సిరీస్, మీ స్వంత వేగంతో నేర్చుకునేందుకు వీలుగా వ్యక్తిగత మార్గాలను అందిస్తుంది. మరింత సమగ్రమైన కంటెంట్ కోసం, దయచేసి Google for Education లెర్నింగ్ సెంటర్ ద్వారా ఇతర ట్రెయినింగ్‌ను అన్వేషించండి. రెండు ట్రాక్‌లు కూడా చిన్న క్విజ్‌ను పూర్తి చేసిన తర్వాత డిజిటల్ సర్టిఫికెట్ బ్యాడ్జ్‌ను అందిస్తాయి.
మాడ్యూల్స్ ఇప్పుడు లైవ్‌లో ఉన్నాయి! 2027 ప్రారంభంలో కొత్త కంటెంట్ రిలీజ్ అవుతుంది.
Google AI ఎడ్యుకేటర్ సిరీస్‌ను, క్లాస్రూమ్ బోధన, టీచర్ అప్‌స్కిల్లింగ్, అలాగే సమగ్ర లెర్నింగ్‌లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను అనుసంధానించడం ద్వారా భారతదేశ NEP 2020 (జాతీయ విద్యా విధానం 2020) కీలక ఆదేశాలకు, విజన్‌కు సపోర్ట్ చేయడానికి రూపొందించాము.
ప్రతి టీచర్‌కు ఈ ట్రెయినింగ్ ఉచితం. ట్రెయినింగ్ పూర్తయ్యాక, చిన్న క్విజ్‌ను పూర్తి చేసిన తర్వాత టీచర్లకు బ్యాడ్జ్‌లు లభిస్తాయి.
Googleకు చెందిన AI టెక్నాలజీల ఎడ్యుకేటర్ సిరీస్ (GES), టీచర్లకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్, నిరంతర లెర్నింగ్ కోసం స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది. ప్రధాన ప్రయోజనాల్లో ఇవి ఉన్నాయి:
- ప్రొఫెషనల్ గుర్తింపు: పూర్తి చేసిన ప్రతి మాడ్యూల్‌కు డిజిటల్ బ్యాడ్జ్‌ను పొందండి.
- అధికారిక సర్టిఫికేషన్: కనీసం 6 మాడ్యూల్స్‌ను పూర్తి చేసిన తర్వాత Google సర్టిఫికేట్‌ను అందుకోండి.
- ప్రాక్టికల్ క్లాస్రూమ్ ప్రభావం: లెసన్ ప్లానింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఆటోమేషన్, విద్యార్థుల అవసరాలకు మెరుగైన సపోర్ట్ అందించడానికి వ్యక్తిగతీకరించిన బోధన కోసం సమయాన్ని ఆదా చేసే నైపుణ్యాలను పొందండి.
- Google AI Educator Series (GES) అనేది భిన్నమైనది, ఎందుకంటే ఇది టీచర్లు ఎలా నేర్చుకుంటారు, వారికి ఎంత సమయం అందుబాటులో ఉంటుంది అనే అంశాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది.
- GES అనేది NEP 2020కి అనుగుణంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఎవరికి వారు తమకు అనుకూలమైన వేగంతో పూర్తి చేసేలా రూపొందించబడింది.
- ట్రెయినింగ్‌లో చిన్న చిన్న మాడ్యూల్స్ ఉంటాయి, వీటిని ఏ క్రమంలోనైనా పూర్తి చేయవచ్చు, టీచర్ షెడ్యూల్‌కు సులభంగా అనుగుణంగా మార్చుకునేలా ఇది ఉంటుంది.
- ఈ ట్రెయినింగ్‌ను టీచర్లు, ఫ్యాకల్టీ సహకారంతో రూపొందించడం జరిగింది – టీచర్లు, ఫ్యాకల్టీ కోసం – వారి వర్క్‌ఫ్లోకు అనుగుణంగా రూపొందించడం జరిగింది
మీకు Google AI ట్రెయినింగ్ ఆప్షన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, ఆసక్తిని తెలియజేసే ఫారమ్‌ను పూరించవచ్చు.
అవును. వర్క్‌షాప్‌లకు నాయకత్వం వహించడానికి లోకల్ టెక్ ఇంటిగ్రేటర్లు, ఇన్స్ట్రక్షనల్ కోచ్‌లను సిద్ధం చేయడానికి Google భారతదేశం అంతటా ప్రాంతీయ ట్రెయిన్-ది-ట్రెయినర్ ఈవెంట్లను అందిస్తుంది. అదనంగా, అన్ని సెషన్లలో డౌన్లోడ్ చేయగల స్లయిడ్ డెక్‌లు, సమగ్ర ఫెసిలిటేటర్ గైడ్లు ఉంటాయి, తద్వారా సంస్థలు స్వతంత్ర, అంతర్గత ట్రెయినింగ్ రోజులను హోస్ట్ చేయగలవు. నిర్దిష్ట రిక్వెస్ట్ కోసం, in-ges-support@google.com ద్వారా సంప్రదించండి
- త్వరగా ఆన్సర్లు పొందడం కోసం AI టూల్స్‌పై ఆధారపడటం చాలా ఈజీ అని మాకు తెలుసు. అయితే, మేము స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు ఒక విషయం అర్థమైంది. చాలా మంది కేవలం ఆన్సర్లు పొందడం కంటే, సబ్జెక్ట్‌ను లోతుగా అర్థం చేసుకోవడానికి AI టూల్స్‌ను ఒక మీడియంగా (సాధనంగా) వాడుకోవాలని కోరుకుంటున్నారు. తమ లెర్నింగ్ జర్నీలో ఒక స్టడీ పార్ట్నర్లా ఉంటూ, సబ్జెక్ట్ మీద లోతైన అవగాహన కలిగించే టూల్ కావాలని వారు ఆశిస్తున్నారు.
- జనం ఏదైనా నేర్చుకునే విధానాన్ని మరింత సులభతరం చేయడానికి మేము Geminiని రూపొందించాము. ఉదాహరణకు, Geminiలోని లెర్నింగ్ గైడెన్స్, నేరుగా సమాధానాలు పొందడానికి, సపోర్ట్ లేకుండా ఒక కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవడానికి కష్టపడటానికి మధ్య ఒక బలమైన మధ్యేమార్గాన్ని అందిస్తుంది, ఇది నిజంగా వారి విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేసే విధంగా కష్టమైన టాపిక్లతో మరింత లోతుగా ఎంగేజ్ అవ్వడానికి వ్యక్తులను ఎనేబుల్ చేస్తుందని మేము ఆశిస్తున్నాము.
- ఈ టూల్, నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మా మోడల్స్ ఫ్యామిలీ అయిన LearnLM ద్వారా కూడా సపోర్ట్ చేయబడుతుంది. టీచర్లు, టీచింగ్ మెథడాలజీ (పెడగాజికల్) ఎక్స్‌పర్ట్‌ల కొలాబరేషన్‌తో (సహకారంతో) LearnLMను డిజైన్ చేశాము. ఇందులో లెర్నింగ్ సైన్స్ ప్రిన్సిపల్స్‌ను ఉపయోగించాము. ఇది స్టూడెంట్స్‌లో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. వారిపై మరీ ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ (కాగ్నిటివ్ లోడ్) పడకుండా చూస్తుంది. వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ మోడల్ తనను తాను మార్చుకుంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీని, మెటా-కాగ్నిటివ్ థింకింగ్‌ను (సొంతంగా ఆలోచించడాన్ని) పెంచుతుంది. మేము మా మోడల్ ప్రధాన భాగంలో బోధనా సూత్రాలను రూపొందించాలనుకున్నాము, ఎందుకంటే AI మరింత బోధనాపరంగా ఆధారపడినప్పుడు, అది నేర్చుకోవడంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని మేము చూశాము.
- ఈ ప్రశ్నలను దృష్టిలో ఉంచుకుని, AI టూల్స్‌ను అంచనా వేసే ఒక ఫ్రేమ్‌వర్క్‌ను డెవలప్ చేయడానికి మేము Digital Promiseతో కూడా పనిచేశాము. ఎడ్యుకేషన్, టెక్నాలజీ, రీసెర్చ్ రంగాలకు చెందిన 50 మందికి పైగా ఎక్స్‌పర్ట్‌ల నుండి వచ్చిన ఐడియాల (ఇన్సైట్స్) ఆధారంగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాము. AIని ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాల్లో ఇది మంచి రిసోర్స్‌లను అందిస్తుంది.
- అదనంగా, Google డొమైన్ స్థాయిలో అడ్మిన్ కంట్రోల్స్‌ను అందిస్తుంది, ఇవి టూల్స్‌కు యాక్సెస్‌ను కంట్రోల్ చేసే సామర్థ్యాన్ని ఇన్స్టిట్యూషన్ అడ్మిన్లకు అందిస్తాయి.